VBN Speech - Siva Kumar Emmadi

VBN Logo Launch Speech By Siva Kumar Emmadi - Founder & President of VBN

e1
e2
e3

స్వామియే శరణం అయ్యప్ప

e4 జై వాసవి

ఈ భూమిపై మనిషిగా పుట్టినందుకు నేను సంతోషిస్తున్నాను

ఆషియా ఖండం తో అపూర్వ అనుబంధం ఉన్నదని నేను ఆనందిస్తున్నాను

భారతీయుడి గా పుట్టడం నా మహద్భాగ్యం అని భావిస్తున్నాను

హృదయంగమమైన ఈ హైదరాబాద్ నగరం లో నివసిస్తున్నందుకు నేను ధన్యుడిని అయ్యాను అనుకుంటున్నాను

అన్నిటిని మించి , వైశ్యుడిగా పుట్టి నందుకు నేను గర్విస్తున్నాను

ఎందుకంటే, వైశ్యులే తరతరాల ఈ భారతీయ జీవన స్రవంతి నిలబడటానికి పట్టుకొమ్మ.

వైశ్యులే వేల ఏళ్ళ నించి ఈ గడ్డని వర్తక వ్యవసాయాల్లో నాయకత్వం వహించి విస్తరింపచేశారు. 

వైశ్యులే విశాలమైన విద్యాలయాలనీ అద్భుతమైన దేవాలయాల్నీ నిర్మించటానికీ నిలబెట్టటానికీ మూలకారకులు 

భరుకచ్చం, బందరు ల నించి భారతీయ సామగ్రిని ఎగుమతి చేసి భారత జయకేతనం ప్రపంచమంతా నాటిందీ వైశ్యులే

అలా వాణిజ్య వ్యవసాయాల్లో వేల ఏళ్లుగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళిన మనం ఇవాళ్ళ కొద్దిగా వెనుకంజ వేశాము. 

సమాజంలో అనేక ఇతర వర్గాలు వ్యాపారంలో మనతో పోటీ పడుతున్నాయి. కొన్ని చోట్ల మనకంటే ముందంజ వేసాయి.

అధికారం వలనా, అధిక శ్రమ వలనా అన్నిటికంటే పరస్పర సహకారం వలనా మిగతా వర్గాలు మనల్ని తోసిరాజు అంటున్నాయి. మారుతున్న ప్రపంచం మననీ మారమని అంటోంది.

మన పూర్వ వైభవం నిలబడాలి అంటే , వాణిజ్యంలో మన నాయకత్వం సుస్థిరం అవాలంటే ఏమిచెయ్యాలి ?

కోట్లో లక్షలో ఏదో ఒక మనిషికో ఒక వ్యవస్థకో ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తారని ఎదురుచూడటమా , కాదు. దాని వల్ల ఏదో స్వల్ప కాల ఉపయోగం ఉంటె ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకి కావాల్సింది పెద్ద మార్పు. అది ఎలా సంభవం అంటే పరస్పర సహకారం వల్లనే అని నా దృఢ విశ్వాసం.

పరస్పర సహకారం అంటే ఎదో ఒక్క సారి చేసి వదిలేసే పని కాదు, మన వాళ్ళకు మనం ఎంత ఎక్కువ చేయగలమో చెయ్యటం ఎంత ఎక్కువ చేయించుకో గలమో చేయించుకోవటం.

ఊరికే చేసే సహకారం మనకి వొద్దు. 

మనకి కావలసింది, వీలైనంత వరకు ఖర్చు పెట్టేవన్నీ వైశ్యుల వర్తకాల ద్వారా చేయించుకోవడం. ఇలా మనకి మనం పరస్పరం సహకరించుకుంటూ పరస్పర అభివృద్ధి తో మన వైశ్య వర్గం మళ్ళీ వర్తక వాణిజ్యాలలో నాయకత్వం వహించెట్టు చేద్దాం.

ఈ పనిని సమర్దవంతం గా చెయ్యటానికి ఒక వ్యవస్థ అవసరం. అదే ఈ వైశ్య వాణిజ్య బంధం(బృందం). ఒక్కడి కోసం అందరం-అందరికోసం ఒక్కడు అనే సూక్తిని నిజం చేద్దాం.